కల్వకుర్తిలో పట్టభద్రుల ఓటు నమోదు అవగాహన కార్యక్రమం
- కల్వకుర్తిలో పట్టభద్రుల ఓటు నమోదు అవగాహన కార్యక్రమం - October 26, 2026
- జూపల్లి గ్రామపంచాయతీ నూతన కార్యదర్శికి ఘన స్వాగతం - October 26, 2026
- తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ఔదార్యం - October 25, 2026

కల్వకుర్తి:
మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ నమోదులో భాగంగా కల్వకుర్తి పట్టణంలో ఈరోజు పట్టభద్రుల ఓటు నమోదు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.కల్వకుర్తి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట RSP ఫౌండేషన్ మరియు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ ఓటుగా నమోదు చేసుకోవాలని, పట్టభద్రుల ఓటు ప్రాధాన్యతను వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బావండ్ల మధు, కార్మిక సంఘం అధ్యక్షులు సూర్యప్రకాష్ రావు, మున్సిపల్ మాజీ కో-ఆప్షన్ సభ్యులు కుడుముల మనోహర్ రెడ్డి, ఆర్య వైశ్య సంఘం నాయకులు దాచేపల్లి శ్రీనివాసులు, మండల మాజీ కో-ఆప్షన్ సభ్యులు రుక్మొద్దీన్, BRSV రాష్ట్ర నాయకుడు దారమోని గణేష్, ఉపసర్పంచ్ భీం, RSP ఫౌండేషన్ సభ్యులు అశ్విన్, చందు, కిరణ్, రాము, BRS పార్టీ నాయకులు సురేష్ గౌడ్, బీమ్లా నాయక్, శ్రీరామ్, పూరి రమేష్, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
