ఎర్రవల్లి భూ నిర్వాసితుల దీక్షలు 293వ రోజుకు చేరిక
- కల్వకుర్తి ఎమ్మెల్యే చేతుల మీదుగా రేపు వేరుశనగ విత్తనాల పంపిణీ - September 20, 2026
- కేంద్రం నిర్ణయంతో గ్రామీణ పేదలకు సొంతింటి కల సాకారం: పద్మ అనిల్ ముదిరాజ్ - September 20, 2026
- ఎర్రవల్లి భూ నిర్వాసితుల దీక్షలు 293వ రోజుకు చేరిక - September 20, 2026
నాగర్ కర్నూల్ జిల్లా / చారకొండ:
నాగర్ కర్నూల్ జిల్లా, చారకొండ మండలం, ఎర్రవల్లి గ్రామంలో డిండి రిజర్వాయర్ కు అనుసంధానంగా నిర్మిస్తున్న ఎర్రవల్లి రిజర్వాయర్ కోసం భూములు కోల్పోయిన నిర్వాసితుల నిరవధిక దీక్షలు నేటితో 293 రోజులకు చేరాయి.పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఎర్రవల్లి రిజర్వాయర్ ఏర్పాటు కోసం తమ సారవంతమైన భూములను కోల్పోయామని, ప్రభుత్వం ఇప్పటివరకు సరైన పరిహారం, పునరావాస ప్యాకేజీ కల్పించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గత 293 రోజులుగా గ్రామంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో మహిళలు పెద్ద సంఖ్యలో కూర్చొని నిరసన తెలుపుతున్నారు. చేతులు పైకెత్తి నినాదాలు చేస్తూ తమ నిరసనను తెలియజేస్తున్నారు.
నిర్వాసితుల డిమాండ్లు:
1. 2013 భూసేకరణ చట్టం ప్రకారం న్యాయమైన పరిహారం చెల్లించాలి.
2. నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించాలి.
ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ.. "భూమి పోయింది, బతుకుతెరువు పోయింది. అధికారులు, ప్రజాప్రతినిధులు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. న్యాయం జరిగే వరకు మా దీక్షలు ఆగవు" అని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
