టీపీఎఫ్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి : కావలి యాదయ్య

టీపీఎఫ్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి : కావలి యాదయ్య

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 26: కొత్తగూడెంలో ఈ నెల 31న నిర్వహించనున్న తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్) 17వ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని టీపీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కావలి యాదయ్య కోరారు. సోమవారం కట్టంగూర్ లో ఆవిర్భావ సభ కరపత్రాలను మండల అధ్యక్షుడు రాపోలు పవన్‌కుమార్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నా ప్రజల ఆకాంక్షలు పూర్తిస్థాయిలో నెరవేరలేదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందని విమర్శించారు. యువతకు నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలని, అభివృద్ధిని అన్ని జిల్లాలకు వికేంద్రీకరించాలని కోరారు. తెలంగాణ ప్రజల హక్కుల సాధనకు ప్రజా ఉద్యమాలు బలోపేతం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో టీపీఎఫ్ జిల్లా నాయకులు గుండెబోయిన బాలకృష్ణ, రాసాల బాలస్వామి, ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు.1000392562.jpg

You may also like...