తర్నికల్ తండాలో ఎక్సైజ్ దాడులు..1,100 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం.. 8 లీటర్ల నాటుసారా స్వాధీనం
- ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ రాజీనామాకు ఢిల్లీలో ధర్నా.. పాల్గొన్న ఎమ్మెల్యే కసిరెడ్డి - October 13, 2026
- గాయత్రి దేవి అవతారంలో అమ్మవారు దర్శనం – భక్తులతో కిటకిటలాడిన దుర్గాదేవి మండపాలు - October 13, 2026
- రేపు పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్న ఎమ్మెల్యే కసిరెడ్డి - October 13, 2026
కల్వకుర్తి అక్టోబర్ 10: కల్వకుర్తి మండలం తర్నికల్ తండాలో ఎక్సైజ్ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన 1,100 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేయడంతో పాటు, 8 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేశారు.మహబూబ్‌నగర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఈ దాడులు చేపట్టారు. కల్వకుర్తి ఎక్సైజ్ స్టేషన్,నాగర్‌కర్నూల్ డీటీఎఫ్, మహబూబ్‌నగర్ ఎన్‌ఫోర్స్‌మెంట్, హైదరాబాద్ ఎస్‌టీఎఫ్, జడ్చర్ల ఎక్సైజ్ బృందాలు సమన్వయంతో ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.నాటుసారా తయారీ, నిల్వ, రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు.ఈ దాడుల్లో డీటీఎఫ్ సీఐ నాగార్జున రెడ్డి, ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ తిరుపతిరెడ్డి, ఎస్‌టీఎఫ్ సీఐ వెంకటేశ్వర్లు, కల్వకుర్తి ఎక్సైజ్ ఎస్‌హెచ్‌ఓ కె. రవిచంద్రారెడ్డి, ఎస్‌ఐ చాంద్ బి షేక్‌తో పాటు ఆయా బృందాల సిబ్బంది పాల్గొన్నారు.
