వాసవిలో భక్తి సందడి.. బతుకమ్మ, నవరాత్రి వేడుకలు ఘనం
- వాసవిలో భక్తి సందడి.. బతుకమ్మ, నవరాత్రి వేడుకలు ఘనం - October 11, 2026
- బాన్సువాడ ఆర్టీసీ డిపోలో యూనియన్ ఎన్నికల సందడి - October 9, 2026
- రామారెడ్డి పీహెచ్సీలో డీఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీ - October 8, 2026

బాన్సువాడ: వాసవి హైస్కూల్లో బతుకమ్మ, దేవీ నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి బి. లక్ష్మి శ్వేత ఆధ్వర్యంలో విద్యార్థులు బతుకమ్మ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. నవదుర్గల వేషధారణలో విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ లక్ష్మి శ్వేత మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, దేవీ నవరాత్రులు అమ్మవారి తొమ్మిది రూపాలను ఆరాధించే పవిత్ర పండుగలని తెలిపారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో మన సంప్రదాయాల పట్ల గౌరవం, భక్తిభావం పెంపొందుతాయని అన్నారు.విద్యార్థులు, ఉపాధ్యాయులు బతుకమ్మ పాటలతో సందడి చేస్తూ వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ పి. విజయ్ కుమార్, ప్రిన్సిపాల్ బి. లక్ష్మి శ్వేత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
