ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కలిసిన అంబేద్కర్ సంఘ సభ్యులు
- SR ఫౌండేషన్ ఆధ్వర్యంలో IMAX లైట్ ఏర్పాటు… - October 8, 2026
- బతుకమ్మ దసరా సందర్భంగా స్ట్రీట్ లైట్లు ఏర్పాటుచేసిన పాలకవర్గం… - October 8, 2026
- బీబీపేట్ PACS నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం. - October 8, 2026
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అంబేద్కర్ చౌరస్తాలో రోడ్డు వెడల్పులో భాగంగా అంబేద్కర్ గారి విగ్రహం అక్కడినుండి తీపించి మున్సిపల్ ఆఫీస్ లో భద్రంగా ఉంచగలరని, రోడ్డు పనులు పూర్తయిన తర్వాత రోడ్డు మధ్యలో మిడిల్ పాయింట్ చూసి దానిని పెట్టగలరని, ఇట్టి విషయమై గౌరవ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సార్ గారు మధ్యలోనే పెట్టిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఇట్టి విషయాన్ని తెలియజేస్తూ మున్సిపల్ చైర్మన్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు 9వ వార్డు కౌన్సిలర్ గాదే తిరుపతి గారు, ఎల్లారెడ్డి మండల అధ్యక్షులు మ్యాతరి అమృత రావు, డివిజన్ అధ్యక్షులు మర్లు సాయిబాబా, పట్టణ అధ్యక్షులు ఎర్రోళ్ల ఎల్లుబాబు, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ మెగావత్ కనిరాం తదితరులు పాల్గొన్నారు.

