అనారోగ్యంతో మాజీ ఎంపిటిసి మృతి
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 7 : మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, హైకోర్టు న్యాయవాది శేరి చత్రపతి సతీమణి మాజీ ఎంపిటిసి శేరి అనురాధ మంగళవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. కట్టంగూర్ లోని స్వగృహంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. నివాళులు అర్పించిన వారిలో శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దైద రవీందర్, కొండేటి మల్లయ్య, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నలగాటి ప్రసన్న రాజ్, మాజీ జెడ్పిటిసి సుంకర బోయిన నర్సింహ్మ, స్థానిక సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ లతోపాటు వివిధ పార్టీల నాయకులు ఉన్నారు.

