కొలువుదీరిన గణనాథులు ఊరువాడా ఏకదంతుడి నామస్మరణం

కొలువుదీరిన గణనాథులు

ఊరువాడా ఏకదంతుడి నామస్మరణం

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 15 : గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం మండలంలోని అన్ని గ్రామాల్లో గణనాథులు కొరువుదీరారు. మండల వ్యాప్తంగా వివిధ అకృతుల్లో సుమారు 300వినాయక విగ్రహాలు వెలిశాయి. అన్ని గ్రామంలోని విగ్రహాల వద్ద ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో వేర్వేరుగా జరిగిన పూజ కార్యక్రమంలో సర్పంచ్ లు ముక్కామల శ్యామల శేఖర్, బెల్లి సుధాకర్, వడ్డె సైదిరెడ్డి, కురిమిల్ల మల్లేష్, గుల్లి నరేష్, కొలిపాక సురేందర్ గౌడ్, ఇప్పలపల్లి అనితాశ్రీను, కుంభం అనిల్ రెడ్డి, దార సత్తెమ్మబిక్షం, చిలుముల సైదులు, వల్లపు వెంకటనారాయణరెడ్డి, వివిధ పార్టీల నాయకులు సుంకరబోయిన వెంకన్న, మిట్టపల్లి శివ, గద్దపాటి దానయ్య, కక్కిరేణి నవీన్, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.1000345722.jpg

You may also like...