చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి కి ఘన సన్మానం
- చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి కి ఘన సన్మానం - October 5, 2026
- గాంధీభవన్‌కు తరలిన జనగామ సేవాదళ్ నాయకులు - October 5, 2026
- పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలి - October 5, 2026

చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన కొమ్మూరి ప్రశాంత్ రెడ్డిని జనగామ మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి–శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డికి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చైర్మన్‌గా కొత్త బాధ్యతలు చేపట్టిన ప్రశాంత్ రెడ్డి మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. రైతులు, వ్యాపారులు, మార్కెట్‌కు వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మార్కెట్ కమిటీ అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం ఆయన సమర్థవంతంగా పనిచేస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రశాంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు.
