మహనీయుల ఉత్సవాల కమిటీ నూతన కార్యవర్గ ఏర్పాటుకు తరలిరండి
- “ఆగకు…అడుగు వేయి…అడ్డంకులే నీకు మెట్లవుతాయి!నీ కలలే రేపటికొత్త ప్రపంచానికి నాంది.” - September 16, 2026
- గుంతలే గతి.. శంకర్పల్లి రోడ్లపై అధికారుల నిర్లక్ష్య పరాకాష్ట! - September 15, 2026
- అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం సమావేశం - September 15, 2026

జ్ఞానతెలంగాణ, శంకర్పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలో మహనీయుల ఉత్సవాల కమిటీ నూతన కార్యవర్గాన్ని ఈ నెల 20వ తేదీ ఆదివారం ఏర్పాటు చేయనున్నట్లు కమిటీ మండల చైర్మన్ బి. శంకర్ తెలిపారు. మండలంలోని ప్రతి గ్రామం నుంచి ప్రతినిధులు, మహనీయుల ఆశయాలను విశ్వసించే ప్రతి ఒక్కరూ కార్యక్రమానికి తరలిరావాలని పిలుపునిచ్చారు.శంకర్పల్లి మండలంలోని బీడీఎల్ చౌరస్తా వద్ద గల రైమండ్స్ షోరూమ్ పైన రెండో అంతస్తులోని జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి ఆఫీస్ కార్యాలయంలో నూతన కార్యవర్గ ఏర్పాటు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడిచే ప్రతి వ్యక్తి కమిటీలో సభ్యుడిగా కొనసాగాలని, మహనీయుల ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఐక్యంగా కృషి చేయాలని బి. శంకర్ కోరారు.మహనీయుల ఉత్సవాల కమిటీ చేవెళ్ల నియోజకవర్గ చైర్మన్ బండారి బాలకిషన్, వైస్ చైర్మన్ నల్లోళ్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అన్ని గ్రామాల నుంచి ప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
