అర్ధరాత్రి అరెస్టులతో విద్యార్థి నాయకులపై ఉక్కుపాదం – సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి: బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రవట్టి సాయిబాబా
- అర్ధరాత్రి అరెస్టులతో విద్యార్థి నాయకులపై ఉక్కుపాదం – సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి: బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రవట్టి సాయిబాబా - September 11, 2026
- విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి తెలంగాణ చరిత్ర పరిరక్షణకు ‘సప్త సంకల్పాలు’ అమలు చేయాలి: బీజేపీ - September 10, 2026
- ప్రజా భద్రతకు సీసీ కెమెరాలే నేటి నిఘా కవచం యువత సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి – ఎస్సై వెంకటరావు - September 10, 2026
బాన్సువాడ, సెప్టెంబర్ 11: ఎలాంటి పిలుపు, కార్యక్రమం లేకపోయినా బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులను పోలీసులు అర్ధరాత్రి నుంచి అరెస్టులు చేయడం దారుణమని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రబట్టి సాయిబాబా ఆరోపించారు. విద్యార్థి నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేయడం ప్రభుత్వ అసహనానికి నిదర్శనమని విమర్శించారు.
పోలీసులు అర్ధరాత్రి నుంచి విద్యార్థి నాయకుల ఇళ్లకు వెళ్లి అరెస్టులు చేయడం వెనుక ప్రభుత్వ భయాందోళన స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఎలాంటి ఆందోళనకు పిలుపు ఇవ్వకపోయినా అరెస్టులు చేయడం పోలీసుల ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని చాటుతోందని అన్నారు.
విద్యార్థుల సమస్యలకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం, ప్రశ్నించే విద్యార్థి నాయకులను అరెస్టు చేయడం సరికాదని సాయిబాబా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాలరాయడం తగదన్నారు.
విద్యార్థులకు సమాధానం చెప్పలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఎర్రబట్టి సాయిబాబా డిమాండ్ చేశారు.
