చెల్లి.. బుజ్జి అంటూ వివాహితతో కానిస్టేబుల్ రాసలీలలు!

ఖమ్మం: కోర్టు కేసు విచారణ నిమిత్తం వచ్చిన ఓ వివాహితను ‘చెల్లి’, ‘బుజ్జి’ అంటూ పరిచయం పెంచుకుని, ఆమెతో అక్రమ సంబంధం కొనసాగించాడని ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాంబ్ స్క్వాడ్‌లో పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ రాంబాబుపై ఆరోపణలు వెల్లువెత్తాయి. కేసు విషయంలో కోర్టుకు వస్తున్న సమయంలో మహిళతో పరిచయం పెంచుకున్న కానిస్టేబుల్ ఆమెను తన మాటలతో లోంగదీసుకుని సన్నిహితంగా మెలిగినట్లు ఆమె భర్త ఆరోపిస్తున్నాడు.

భార్య ప్రవర్తనపై అనుమానం కలిగిన భర్త కొంతకాలంగా నిఘా పెట్టాడు. ఈ క్రమంలో కానిస్టేబుల్ రాంబాబు తన భార్యతో ఏకాంతంగా ఉన్న సమయంలో భర్త వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిపాడు. అంతేకాకుండా గతంలో ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సందర్భాలకు సంబంధించిన కొన్ని వీడియోలు భార్య ఫోన్‌లో లభించినట్లు భర్త పేర్కొన్నాడు.

తనను పట్టుకున్న సమయంలో కానిస్టేబుల్ రాంబాబు తనపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడని భర్త ఆరోపించాడు. పదేళ్లుగా ప్రేమించి వివాహం చేసుకున్న తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, కేసు విషయంలో కోర్టుకు వచ్చిన తన భార్యను పోలీస్ విధుల్లో ఉన్న వ్యక్తి ఇలా ట్రాప్ చేయడం ఏమిటని ప్రశ్నించాడు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యుడైన కానిస్టేబుల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. ఆరోపణలపై అధికారిక విచారణ అనంతరం వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

You may also like...