హరీశ్‌రావుకు గౌడి చర్ల వారి వివాహ ఆహ్వానం
- మరికొద్ది క్షణాల్లో టంగుటూరుకు మందకృష్ణ మాదిగ - October 15, 2026
- దేవుల నాయక్‌కు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడి జన్మదిన శుభాకాంక్షలు - October 12, 2026
- పెళ్లి హామీతో లైంగిక వేధింపుల ఆరోపణ.. డీఐ బాలస్వామి అరెస్ట్! - October 11, 2026

రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని జన్వాడ మాజీ సర్పంచ్ గౌడి చర్ల లలిత నరసింహ తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావును మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వివాహానికి సంబంధించిన వివరాలను తెలియజేసి, కుటుంబ సమేతంగా విచ్చేసి వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. హరీశ్‌రావుకు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల వివాహ ఏర్పాట్లపై చర్చ జరిగింది. వివాహ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు గౌడి చర్ల లలిత నరసింహ తెలిపారు. ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు, రాజకీయ ప్రముఖులను వివాహానికి ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం చేవెళ్ల నియోజకవర్గం ఇన్చార్జ్ బండమీది వెంకటేష్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కుర్వ విజయ్, బీఆర్ఎస్ నాయకులు రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు
