Monthly Archive: October 2026

మొగులాన్‌పల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

మొగులాన్‌పల్లి శివారు అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న స్థావరంపై బాన్సువాడ పోలీసులు దాడి చేసి తొమ్మిది మందిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.18,630 నగదు, 8 సెల్‌ఫోన్లు, 4 మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

17 ఏళ్ల తర్వాత తిప్పాపూర్ గ్రామానికి బస్సు సేవలు పునఃప్రారంభం

కామారెడ్డి నియోజకవర్గం, భిక్కనూర్ మండలం తిప్పాపూర్ గ్రామ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరింది. దాదాపు 17 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించడంతో గ్రామస్థుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ షబ్బీర్ అలీ గారు మంత్రి గారి దృష్టికి తీసుకురావటంతో బస్సును మంజూరు చేసి, ఈరోజు ప్రారంభించారు. దసరా పండుగ సందర్భంగా గ్రామానికి బస్సు సౌకర్యం అందుబాటులోకి రావడంతో మహిళలు, విద్యార్థులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా…

కల్వకుర్తిలో రావణ దహన వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి – ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు

దసరా పండుగ వేడుకల్లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు.తన స్వగ్రామం నుంచి తిరిగి హైదరాబాద్ వస్తున్న సమయంలో ముఖ్యమంత్రి గారు కల్వకుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో జరుగుతున్న దసరా వేడుకలకు హాజరయ్యారు. వేదికపైకి వచ్చిన సీఎం గారికి స్థానిక ప్రజాప్రతినిధులు శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, ప్రజలందరికీ…

లింగారెడ్డిపల్లి గ్రామంలో ఆడపడుచుల బతుకమ్మలతో దసరా సంబురాలు

వెల్దండ మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామ ఆడపడుచులు బతుకమ్మలతో ఆడిపాడి, అనంతరం జమ్మిచెట్టు వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మహ్మద్ అన్వర్ పాషా, ఉప సర్పంచ్ జోగు రాములమ్మ లింగమయ్య, గ్రామ పెద్దలు రాఘవ రెడ్డి, నేతలు కుపిరెడ్డి అశోక్ రెడ్డి, మైల అల్వాల్ రెడ్డి, మైల హనుమంత్ రెడ్డి, మైల సుధాకర్ రెడ్డి, మల్లేపాకుల శేఖర్, పబ్బు శ్రీకాంత్, వార్డు సభ్యులు వట్టేపు అల్లాజి,…

యమపాశమైన ఈవీ చార్జర్.. యువకుడు బలి

వెల్దండ, అక్టోబర్ 21: పండుగ పూట కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్న యువకుడు ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.వెల్దండ మండలంలోని ఉప్పలగట్టు గ్రామ పంచాయతీ జాన్లగట్టు తండాకు చెందిన వడ్త్యావత్ దేవేందర్ (29) మంగళవారం ఉదయం 11 గంటలకు తన సోదరుని ఈవీ కార్ ఛార్జింగ్ పెట్టి ఉండగా, కారు డోర్ తీస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.ఈ ఘటనలో ఆయన భార్యకు సైతం విద్యుత్ షాక్ తగిలి స్వల్ప గాయాలతో…

ఆలయాల నిర్మాణానికి గోలి బుచ్చిరెడ్డి కుటుంబం రూ.1.11 లక్షల విరాళం

వెల్దండ,అక్టోబర్ 21: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం చెరుకూరు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శివాలయం,ఆంజనేయస్వామి దేవాలయాల నిర్మాణానికి గోలి బుచ్చిరెడ్డి కుటుంబ సభ్యులు రూ.1,11,111 విరాళంగా అందజేశారు.బుచ్చిరెడ్డి కుమారులు గోలి శ్రీనివాస్ రెడ్డి, గోలి శ్రీకాంత్ రెడ్డి, మనుమడు గోలి శివానందన్ రెడ్డిలు బుధవారం ఈ విరాళాన్ని అందించారు.వారి దాతృత్వానికి ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఆ భగవంతుడు వారి కుటుంబానికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బచ్చలకూర శ్రీనివాసులు,ఉపసర్పంచ్…

చేవెళ్లలో రోడ్డు ప్రమాదం…

చేవెళ్ల మండలం అల్లవాడ గేటు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో సెంట్రింగ్ కార్మికుడికి తలకు బలమైన గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్‌లో బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. హెల్మెట్ ధరించి...

పసిడి ధరకు భారీ కోత

హైదరాబాద్‌: బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వినియోగదారులకు కొంత ఊరట లభించింది. పసిడి ధరలు తగ్గుముఖం పట్టగా, వెండి ధరలు మాత్రం పెరిగాయి. అక్టోబర్‌ 21, బుధవారం బంగారం ధరల్లో గణనీయమైన తగ్గుదల నమోదైంది. సోమవారంతో పోలిస్తే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.1,720 తగ్గడం కొనుగోలుదారుల...

2028 నాటికి పోలీసు ఖాళీలన్నీ భర్తీ

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్‌: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు, పోలీసు శాఖను మరింత బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. శాంతిభద్రతలు పటిష్ఠంగా ఉంటేనే రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతమవుతుందని పేర్కొన్నారు. సమాజ రక్షణ కోసం ప్రాణాలను త్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలను స్మరించుకోవడం...

భారత్‌–అమెరికా సంబంధాల బలోపేతానికి కీలక చర్చలు

రష్యా చమురు కొనుగోళ్ల తగ్గింపును స్వాగతించిన అమెరికాభారత్‌లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య కీలక అంశాలపై చర్చలు జరిగాయి. భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌తో జరిగిన భేటీలో వాణిజ్యం, ఇంధనం, పెట్టుబడులు, రక్షణ, ఆధునిక సాంకేతిక రంగాల్లో...