Daily Archive: October 12, 2026

ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి కేవీ ప్రసాద్

ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి కేవీ ప్రసాద్జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 9 : గ్రామీప ప్రాంత ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ పీఎంజేఎఫ్ కేవీ ప్రసాద్ అన్నారు. మండలంలోని ఈదులూరు గ్రామంలో శుక్రవారం లయన్స్ క్లబ్ ఆప్ కట్టంగూర్ కింగ్స్ ఆధ్వర్యంలో చిక్కు రంగయ్య జ్ఞాపకార్ధం ఆయన కుమారుడు చిక్కు శేఖర్, చిక్కు సతీష్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత డయాబెటిస్, కంటి వైద్య శిబిరాన్ని…

పెద్ద చెరువుకు హద్దులను గుర్తిస్తాం ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటాం: తహసిల్దార్ పుష్పలత

పెద్ద చెరువుకు హద్దులను గుర్తిస్తాం ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటాం:తహసిల్దార్ పుష్పలత జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 6 : మండల కేంద్రంలోని పెద్దచెరువును ఎఫ్టిఎల్ పరిధి గుర్తించి హద్దులు ఏర్పాటు చేస్తామని తహసిల్దార్ పుష్పలత తెలిపారు. పెద్ద చెరువు ఆక్రమణకు గురైందని ఇటీవల బీజేపీ నాయకులు కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో పై అధికారుల ఆదేశాలతో మంగళవారం చెరువును రెవిన్యూ, ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ పుష్పలత మాట్లాడుతూ రెవిన్యూ ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా చెరువుకు…

భూముల రీ సర్వే పనులను పరిశీలించిన ఆర్టీవో అశోక్ రెడ్డి

భూముల రీ సర్వే పనులను పరిశీలించిన ఆర్టీవో అశోక్ రెడ్డి జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 6: మండలంలోని రామచంద్రపురం గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ సర్వే పనులను నల్గొండ ఆర్టీవో యారాల అశోక్‌రెడ్డి మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న రీ సర్వే ప్రక్రియను పరిశీలించిన ఆయన.. సర్వే పనుల పురోగతి, భూముల వివరాల నమోదు, హద్దుల నిర్ధారణ తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రీ సర్వేలో భాగంగా చేపడుతున్న క్షేత్రస్థాయి కొలతలు, రికార్డుల పరిశీలన…

శ్రీ దుర్గా మాత అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలి.. డిసిసి ఉపాధ్యక్షులు భూపతిరెడ్డి

ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మానసిక ప్రశాంతతశ్రీ పాండురంగ నాయక దేవాలయంలో శరన్నవరాత్రి పూజలువెల్దండ:మండల కేంద్రంలోని శ్రీ పాండురంగ నాయక దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా డీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ సర్పంచ్ యన్నం భూపతిరెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా భూపతిరెడ్డి మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనిషిలో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు మానసిక ప్రశాంతతను అందిస్తాయని అన్నారు. దుర్గామాత అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అమ్మవారిని…

చీమలదరి లో ఉచిత వైద్య శిబిరం

మోమిన్ పేట్ మండలం చీమలదరి గ్రామంలో అపోలో మెడికల్ కాలేజ్ హాస్పిటల్  వారు జస్టిస్ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చీమలదరి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో సాధారణ వ్యాధుల వైద్య సేవలు మరియు సాధారణ శస్త్ర చికిత్సల వైద్యులు , ఎముకల వ్యాధుల వైద్యులు, మరియు కంటి వ్యాధుల వైద్యులు పాల్గొనడం జరిగింది ఈ క్యాంపులో 350 మందికి పైగా గ్రామస్తులు  పాల్గొనడం జరిగింది ఇట్టి క్యాంపులో  ఉచితంగా బిపి షుగర్…

పండుగకు ఊరెళ్తున్నారా.. ఇంటి భద్రతపై ఓ కన్నేయండి!

పండుగకు ఊరెళ్తున్నారా.. ఇంటి భద్రతపై ఓ కన్నేయండి!విలువైన ఆభరణాలు, నగదు ఇళ్లలో వదిలివెళ్లొద్దు ప్రజలకు కట్టంగూర్ ఎస్సై మునుగోటి రవీందర్ సూచనజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 11: దసరా పండుగ.. కుటుంబ సభ్యులతో సరదాగా గడిపే సమయం.. పండుగ సెలవులు రావడంతో చాలామంది సొంతూళ్లకు, బంధువుల ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతుంటారు. అయితే ఇంటికి తాళం వేసి ఊరెళ్లే సమయంలో కొద్దిపాటి నిర్లక్ష్యం దొంగలకు అవకాశంగా మారవచ్చు. పండుగ సంతోషం ముగిసి ఇంటికి తిరిగొచ్చేసరికి చోరీ జరిగితే ఆ…

కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన చెరుకూరు నేతలు

పబ్బు బాలయ్య కుటుంబానికి రూ.27,500 ఆర్థిక సాయం అందజేతవెల్దండ: కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త పబ్బు బాలయ్య మృతి పట్ల చెర్కూర్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, కష్టకాలంలో తామంతా అండగా ఉంటామని భరోసా కల్పించారు. మానవత్వంతో స్పందించి కుటుంబానికి రూ.27,500 ఆర్థిక సాయం అందజేశారు.కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన కార్యకర్త కుటుంబానికి అండగా నిలవడం తమ బాధ్యతగా భావించి ఈ సాయాన్ని అందించినట్లు తెలిపారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే…

లింగారెడ్డి పల్లి లో ఘనంగా గార్మి ఉత్సవాలు

వెల్దండ : లింగారెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన గార్మి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గ్రామానికి చెందిన అల్లాజి, జహంగీర్, అయూబ్, కుప్ప శీను, నిజాం, సైదులు, బిక్కెన్, సిరాజ్, జూపల్లి రాములు యాదవ్, ఎండీ సిరాజ్ తదితరులు పాల్గొన్నారు.గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో ఉత్సవాల్లో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా, ప్రజలంతా కలిసి ఉత్సవాలను ఆనందోత్సాహాలతో నిర్వహించారు.

మూసీ సుందరీకరణ అదనపు భూసేకరణ ఆపాలి మంత్రి శ్రీధర్ బాబుకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, బాధితుల వినతి

మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు పేరుతో బఫర్ జోన్ పరిమితికి మించి చేస్తున్న అదనపు భూసేకరణను వెంటనే నిలిపివేయాలి.