Monthly Archive: September 2026

మట్టి గణపతులనే పూజించండి బీజేలకు నో పర్మిషన్.. ఎస్సై కురుమూర్తి

*కల్వకుర్తి, సెప్టెంబర్ 07:* గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్సై కురుమూర్తి కోరారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మట్టి విగ్రహాలనే పూజించాలని, డీజేలకు అనుమతి లేదని, మండపాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సూచించారు.ఈ మావేశంలో కమిషనర్ మహ్మద్ షేక్, ఎస్సై రాజశేఖర్, ఫైర్ ఆఫీసర్ చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

పోతె పల్లిలో ఎస్ఐఆర్ పై ప్రత్యేక గ్రామ సభ

పోతె పల్లిలో ఎస్ఐఆర్ పై ప్రత్యేక గ్రామ సభ

*వెల్దండ సెప్టెంబర్ 07:* పోతేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం ఈ నెల 8న ఎస్ఐఆర్ పై గ్రామసభ జరుగుతుందని సర్పంచ్ తగుళ్ల కొండలు యాదవ్ తెలిపారు.మంగళవారం ఉదయం 10 గంటలకు ఈ సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ఎంఆర్ఓ హాజరవుతారని చెప్పారు.సర్పంచ్ కొండలు యాదవ్ అధ్యక్షతన గ్రామసభ జరుగుతుందన్నారు.ఓటర్ల జాబితా సవరణపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు.నోటీసులు అందుకున్న ప్రజలు పత్రాలతో హాజరు కావాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శి, జీపీఓ సంయుక్తంగా విజ్ఞప్తి చేశారు.

స్వచ్ఛమైన నీరు సంపూర్ణ ఆరోగ్యం.. ఐక్యత పౌండేషన్ లక్ష్యం

వెల్దండ 08: వెల్దండ మండలంలోని బొల్లంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని అంకమోనికుంట గ్రామంలో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛ ధార కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఐక్యత ఫౌండేషన్ వ్యవస్థాపకులు, టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో జర్మన్ టెక్నాలజీతో తయారైన ప్రత్యేక యంత్రాలతో నీటి ట్యాంక్ ను ఉప సర్పంచ్ రామకృష్ణ ఆధ్వర్యంలో శుభ్రపరిచారు.గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.శుద్ధ జలం అందించి ప్రజల ఆరోగ్య రక్షణకు కృషి చేస్తున్నామని,…

ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి : ధనలక్ష్మి

ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి : ధనలక్ష్మిజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 7 : ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని ఆశ వర్కర్ల మండల యూనియన్ అధ్యక్షురాలు చౌగోని ధనలక్ష్మి అన్నారు. సమస్యలు పరిష్కరించాలని సోమవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి జమునకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆశలకు కనీస వేతనం రూ.18 వేలుగా నిర్ణయించి పని భారం తగ్గించి పెండింగ్ పారితోషికాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 8న హైదరాబాద్…

దేవాలయాలు ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక.. సుంకి రెడ్డి

కల్వకుర్తి సెప్టెంబర్ 07: తలకొండపల్లి మండలం,దేవుని పడకల్ మరియు పడకల్ గ్రామాల్లో శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తో కలిసి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం దేవుని పడకల్ గ్రామంలోని శ్రీ పోచమ్మ తల్లి ఆలయ అభివృద్ధి కోసం రూ.2,30,000/-రెండు లక్షల ముప్పై వేల రూపాయలు విరాళం అందించారు.ఈ సందర్భంగా…

420 హామీలు.. 13 డిక్లరేషన్లు.. 6 గ్యారెంటీలు అమలు చేయాలి మాజీ జడ్పీటీసీ తరాల బలరాములు

420 హామీలు.. 13 డిక్లరేషన్లు.. 6 గ్యారెంటీలు అమలు చేయాలి మాజీ జడ్పీటీసీ తరాల బలరాములుప్రజావాణిలో తహసీల్దార్‌కు బీఆర్ఎస్ నాయకుల వినతి జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 7 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని మాజీ జడ్పీటీసీ తరాల బలరాములు డిమాండ్ చేశారు. పార్టీ కార్యక్రమంలో భాగంగా సోమవారం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో…

ముందస్తు అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు.. కుర్మిద్ద యాదగిరి

వెల్దండ సెప్టెంబర్ 07: తెలంగాణలో 20 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం బాకీ ఉన్న రూ.12 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని బీజేపీ వెల్డండ మండల అధ్యక్షులు కుర్మిద్దా యాదగిరి ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిలపై విద్యార్థులు, తల్లిదండ్రుల తరఫున ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి సిద్ధమవుతున్న తరుణంలో వెల్డండ పోలీసులు ముందస్తుగా ఇంటికి వచ్చి,అరెస్టు చేయడాన్ని బీజేపీ మండల అధ్యక్షులు కురుమీద్దె యాదగిరి తీవ్రంగా ఖండించారు.ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలపై నిరసన తెలిపే…

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ

వెల్దండ సెప్టెంబర్ 07: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల రెండో విడతలో భాగంగా మండల కేంద్రానికి చెందిన భారీ యాదమ్మకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా సోమవారం సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ భూమి పూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ల సహకారంతో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు మంజూరు చేసే విధంగా కృషి చేస్తానని తెలిపారు….

దళిత స్పీకర్‌ను అవమానిస్తే సహించేది లేదు: మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొల్లారం వెంకట్ రెడ్డి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహంరాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న దళిత స్పీకర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని శంకర్‌పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొల్లారం వెంకట్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.స్పీకర్ పదవికి ఉన్న గౌరవాన్ని మరిచి అసభ్య పదజాలంతో...

బాధిత కుటుంబానికి నాగర్ కర్నూల్ డీసీసీ కార్యదర్శి పరామర్శ

వెల్దండ సెప్టెంబర్ 07: వెల్దండ మండల పరిధిలోని పోచమ్మ గడ్డ తండాకు చెందిన గిరిజన నాయకులు లక్ష్మణ్ నాయక్ కుమారుడు ఇటీవల అనారోగ్యం హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర నాయకులు, నాగర్ కర్నూల్ జిల్లా పిసిసి కార్యదర్శి బాణావత్ శంకర్ నాయక్ సోమవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం రక్షణ ఖర్చులకు గాను రూ….