దళిత స్పీకర్‌ను అవమానిస్తే సహించేది లేదు: మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొల్లారం వెంకట్ రెడ్డి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం
రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న దళిత స్పీకర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని శంకర్‌పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొల్లారం వెంకట్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
స్పీకర్ పదవికి ఉన్న గౌరవాన్ని మరిచి అసభ్య పదజాలంతో మాట్లాడటం బీఆర్ఎస్ నాయకుల అహంకారానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. దళిత స్పీకర్‌ను అవమానించడం అంటే యావత్ దళిత సమాజాన్ని అవమానించడమేనని అన్నారు.
తాతా మధుసూదన్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, స్పీకర్‌కు, దళిత సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలే బీఆర్ఎస్ నాయకులకు తగిన గుణపాఠం చెబుతారని బొల్లారం వెంకట్ రెడ్డి హెచ్చరించారు.

You may also like...