రక్షణ లేని ఆర్టీసీ బస్‌స్టేషన్.. దొంగలకు అడ్డాగా వికారాబాద్ బస్టాండ్
- రక్షణ లేని ఆర్టీసీ బస్‌స్టేషన్.. దొంగలకు అడ్డాగా వికారాబాద్ బస్టాండ్ - September 21, 2026
- స్పెషల్ రీ–అడ్మిషన్‌కు అవకాశం - September 21, 2026
- TGPSC మేనేజర్ (ఇంజినీరింగ్) పోస్టులు - September 21, 2026
వికారాబాద్, సెప్టెంబర్ 21: వికారాబాద్ ఆర్టీసీ బస్‌స్టేషన్‌లో భద్రతా లోపాలు ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సోమవారం ఉదయం 10:16 గంటలకు శంకర్‌పల్లి బస్సు ఎక్కుతున్న ఆలంఖన్‌గూడకు చెందిన కైల చుక్కరెడ్డి స్మార్ట్‌ఫోన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ఘటనపై ఆర్టీసీ సిబ్బందిని సంప్రదించగా బస్‌స్టేషన్‌లోని సీసీ కెమెరాలు ఏడాది కాలంగా పనిచేయడం లేదని తెలిపినట్లు బాధితుడు పేర్కొన్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చోరీలు ఇటీవల పెరుగుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుడు వికారాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. సీసీ కెమెరాలను వెంటనే పునరుద్ధరించి, బస్‌స్టేషన్‌లో భద్రతా సిబ్బందిని పెంచాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

