ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ
- దేవాలయాలు ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక.. సుంకి రెడ్డి - September 7, 2026
- ముందస్తు అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు.. కుర్మిద్ద యాదగిరి - September 7, 2026
- ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ - September 7, 2026
వెల్దండ సెప్టెంబర్ 07: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల రెండో విడతలో భాగంగా మండల కేంద్రానికి చెందిన భారీ యాదమ్మకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా సోమవారం సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ భూమి పూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ల సహకారంతో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు మంజూరు చేసే విధంగా కృషి చేస్తానని తెలిపారు. పేద మధ్య తరగతి కుటుంబాలకు ఈ పథకం ద్వారా ఎంతో ప్రయోజనం చేపడుతుందని, ఇండ్ల నిర్మాణానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిలకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బస్నమోని శ్రీను ముదిరాజ్,పంచాయతీ కార్యదర్శి గిరి గౌడ్, వార్డు సభ్యులు గుద్దేటి కిష్టాల్, ముదిగొండ రమేష్,సిర్సన గండ్ల శేఖర్,మల్లీశ్వరి రంగనాథం,నాయకులు తిరుపతి రెడ్డి, కొయ్యల పుల్లయ్య,ఎండి రషీద్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మట్ట భరత్ గౌడ్, అల్లాజి, మున్సూర్, ఆనంద్,డేవిడ్, చిన్న తదితరులు పాల్గొన్నారు.
