ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి : ధనలక్ష్మి

ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి : ధనలక్ష్మి

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 7 : ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని ఆశ వర్కర్ల మండల యూనియన్ అధ్యక్షురాలు చౌగోని ధనలక్ష్మి అన్నారు. సమస్యలు పరిష్కరించాలని సోమవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి జమునకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆశలకు కనీస వేతనం రూ.18 వేలుగా నిర్ణయించి పని భారం తగ్గించి పెండింగ్ పారితోషికాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 8న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే ఛలో అసెంబ్లీ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో ఆశ వర్కర్లు రేణుక, సంతోష్, సుజాత, మంగమ్మ, భారతి, పార్వతమ్మ, సునీత, సంధ్య ఉన్నారు.1000337138.jpg

You may also like...