బాధిత కుటుంబానికి నాగర్ కర్నూల్ డీసీసీ కార్యదర్శి పరామర్శ

వెల్దండ సెప్టెంబర్ 07: వెల్దండ మండల పరిధిలోని పోచమ్మ గడ్డ తండాకు చెందిన గిరిజన నాయకులు లక్ష్మణ్ నాయక్ కుమారుడు ఇటీవల అనారోగ్యం హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర నాయకులు, నాగర్ కర్నూల్ జిల్లా డిసిసి కార్యదర్శి బాణావత్ శంకర్ నాయక్ సోమవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం రక్షణ ఖర్చులకు గాను రూ. 4 వేల రూపాయలు రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. విలువైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులకు సూచించారు. అధైర్య పడకూడదు కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

You may also like...