నిమజ్జనాల్లో నిర్లక్ష్యానికి నో ఛాన్స్‌! శంకర్‌పల్లి సీఐ రుద్వీర్‌ కుమార్‌ కఠిన హెచ్చరిక

జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి: వినాయక నిమజ్జనాల నేపథ్యంలో శంకర్‌పల్లి పోలీసులు అప్రమత్తమయ్యారు. మండపాలు ఏర్పాటు చేసి ఐదు రోజులు పూర్తవడంతో నిమజ్జనాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఐ రుద్వీర్‌ కుమార్‌ కఠిన హెచ్చరికలు జారీ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అత్యుత్సాహంతో ఊరేగింపులు నిర్వహించడం, ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించడం, నిబంధనలకు విరుద్ధంగా డీజేలు, సౌండ్‌ సిస్టమ్‌లు వినియోగించడం వంటి చర్యలను సహించబోమని స్పష్టం చేశారు. నిమజ్జన ప్రాంతాల్లో ఈత రాని వారు నీటిలోకి దిగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చిన్నారులు, వృద్ధుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. 1012778811.jpg

You may also like...