ముందస్తు అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు.. కుర్మిద్ద యాదగిరి
- దేవాలయాలు ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక.. సుంకి రెడ్డి - September 7, 2026
- ముందస్తు అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు.. కుర్మిద్ద యాదగిరి - September 7, 2026
- ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ - September 7, 2026
వెల్దండ సెప్టెంబర్ 07: తెలంగాణలో 20 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం బాకీ ఉన్న రూ.12 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని బీజేపీ వెల్డండ మండల అధ్యక్షులు కుర్మిద్దా యాదగిరి ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిలపై విద్యార్థులు, తల్లిదండ్రుల తరఫున ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి సిద్ధమవుతున్న తరుణంలో వెల్డండ పోలీసులు ముందస్తుగా ఇంటికి వచ్చి,అరెస్టు చేయడాన్ని బీజేపీ మండల అధ్యక్షులు కురుమీద్దె యాదగిరి తీవ్రంగా ఖండించారు.
ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలపై నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉందని, అలాంటి హక్కును కాలరాస్తూ ఇంటి వద్దకే పోలీసులు వచ్చి ముందస్తు అరెస్టు చేయడం ప్రభుత్వ అసహనానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు.ఈ కార్యక్రమం లో బీజేపీ సీనియర్ నాయకులు గుద్దటి రామస్వామి,వెల్డండ వార్డ్ మెంబెర్స్ రవీందర్ రెడ్డి, రేవల్లి రాజు,రంగరాతి శ్రీశైలంముదిరాజ్ ,మట్ట విష్ణు,బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి కంటం రవి కుమార్, కేశమోని జంగయ్య, ఉపసర్పంచ్ శివ ప్రసాద్,మండల యువ మోర్చా అధ్యక్షులు అరుణ్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.
