కల్వకుర్తిలో అంబేద్కర్ విగ్రహావిష్కరణపై అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం

కల్వకుర్తి, సెప్టెంబర్ 29: కల్వకుర్తి పట్టణంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహావిష్కరణ, కాంస్య విగ్రహ ఏర్పాటు మరియు అంబేద్కర్ కూడలి అభివృద్ధి అంశాలపై చర్చించేందుకు అఖిలపక్షాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు.రేపు (సెప్టెంబర్ 30, 2026) ఉదయం 10:30 గంటలకు యుటిఎఫ్ (UTF) భవనంలో ఈ సమావేశం జరగనుంది. పట్టణంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, మైనారిటీ సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాల నాయకులు ఈ సమావేశంలో పాల్గొనాలని మున్సిపల్ కౌన్సిలర్, జిల్లా గ్రంథాలయ మాజీ డైరెక్టర్ మబ్బు రామరాజు విజ్ఞప్తి చేశారు.1001349573.jpg

అంబేద్కర్ కూడలి అభివృద్ధితో పాటు విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు.

You may also like...