అవసరమైన సంక్షేమ పథకాలనే అమలు చేయాలి.. డీకే మాదిగ

1001221136.jpg

నాగర్ కర్నూల్ : ప్రజలకు అవసరం లేని ఉచిత పథకాలకు బదులుగా విద్య, వైద్యం, ఉపాధి, రైతులకు గిట్టుబాటు ధర, ఆర్టీసీ పరిరక్షణ వంటి మౌలిక అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని బీఆర్‌ఎస్ పార్టీ కొల్లాపూర్ నియోజకవర్గ సోషల్ మీడియా వారియర్స్ డీకే మాదిగ, మామిళ్లపల్లి శ్రీనివాస్ కోరారు. పేదల సంక్షేమం పేరుతో అమలు చేస్తున్న పథకాల వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందించడంతో పాటు ప్రతి పౌరుడికి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.

You may also like...