అనంతగిరి గుట్టల్లో ఘోర బస్సు ప్రమాదం,నలుగురికి చేరిన మృతుల సంఖ్య
- అనంతగిరి గుట్టల్లో ఘోర బస్సు ప్రమాదం,నలుగురికి చేరిన మృతుల సంఖ్య - October 3, 2026
- వికారాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం.. ట్రావెల్స్ బస్సు బోల్తా - October 3, 2026
- కేబినెట్ ముందుకు కీలక నిర్ణయాలు.. - October 1, 2026

జ్ఞాన తెలంగాణ, వికారాబాద్ ప్రతినిధి, అక్టోబర్ 3:
వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి గుట్టల మధ్య ఓం నమశ్శివాయ ట్రావెల్స్‌కు చెందిన బస్సు బోల్తా పడిన ఘటనలో మృతుల సంఖ్య నలుగురికి చేరింది. సంగారెడ్డికి చెందిన ఈ ట్రావెల్స్ బస్సు గుట్టల మధ్య ప్రయాణిస్తుండగా బ్రేక్ ఫెయిల్ కావడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, క్షతగాత్రుల పూర్తి వివరాలు, ప్రమాదానికి అసలు కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల సంఖ్యపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
