విద్యార్థులకు గుర్తింపు కార్డులు అందజేసిన పాఠశాల ఉపాధ్యాయులు,స్వేరోస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్నాపూర్ శ్రీనివాస్
వికారాబాద్ జిల్లా పరిగి మండలం మిట్టకోడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు గుర్తింపు కార్డులను అదే పాఠశాలలోఉపాధ్యాయులుగా పనిచేస్తున్న,స్వేరోస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్నాపూర్ శ్రీనివాస్ అందజేశారు.ఒకవైపు ఉపాధ్యాయుడిగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ,మరోవైపు స్వేరోస్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సామాజిక చైతన్యం, విద్యార్థుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న శ్రీనివాస్ విద్యార్థులకు గుర్తింపు కార్డులు అందజేయడం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.విద్యార్థులకు గుర్తింపు కార్డులు అందించడం ద్వారా వారిలో…
