ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌కు దసరా శుభాకాంక్షలు


జ్ఞానతెలంగాణ, సంగారెడ్డి, కొండాపూర్ :సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ను తోగార్పల్లి బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు కలిసి విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పండుగ శుభాకాంక్షలు తెలిపి, సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో తోగార్పల్లి బీఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఎర్రోళ్ల రవి, మాజీ ఎంపీటీసీ సంతోష్ రెడ్డి, మాజీ ఆత్మ కమిటీ డైరెక్టర్ బుచ్చయ్య, మాజీ సొసైటీ డైరెక్టర్ శివరాజ్, పార్టీ నాయకుడు రాములు పాల్గొన్నారు.

You may also like...