చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగిద్దాం. కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు దొంత్రమోని ప్రవీణ్ ముదిరాజ్.
- మతసామరస్యానికి ప్రతీక. కోకపెట్ గణేష్ లడ్డూను దక్కించుకున్న ముస్లిం సోదరుడు. - September 26, 2026
- భక్తిశ్రద్ధల మధ్య వినాయకుడి లడ్డూ వేలం రూ. 1,10,000 కు దక్కించుకున్న దాసరి ఆనంద్ యాదవ్ కుటుంబం. - September 26, 2026
- చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగిద్దాం. కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు దొంత్రమోని ప్రవీణ్ ముదిరాజ్. - September 26, 2026

బండ్లగూడ జాగిర్: కిస్మత్పూర్ డివిజన్ 122 పరిధిలోని కాళీ మందిర్ చౌరస్తా వద్ద వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను శనివారం రజక సోదరుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిస్మత్పూర్ డివిజన్ 122 కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంత్రమోని ప్రవీణ్ ముదిరాజ్ గారు హాజరయ్యారు.ఈ సందర్భంగా కాళీ మందిర్ చౌరస్తా వద్ద ఉన్న చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ప్రవీణ్ ముదిరాజ్ గారు మాట్లాడుతూ.తెలంగాణ సాయుధ పోరాటంలో అన్యాయంపై ఎదిరించి నిలిచిన వీరనారి చాకలి ఐలమ్మ పోరాట పటిమ, ధైర్యం నేటి తరానికి ఎంతో ఆదర్శనీయమని కొనియాడారు. ఆమె ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.రజక సంఘం ప్రతినిధులు మరియు స్థానిక రజక సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
