పత్తి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి : ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వీరేశం

పత్తి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి : ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వీరేశం

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 28 : రైతులు పత్తి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. బుధవారం మండలంలోని అయిటిపాములలోని శ్రీనాథ్ కాటన్ పత్తి మిల్లులో (సీసీఐ) పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. సీసీఐ కొనుగోలు కేంద్రంలో ప్రైవేట్ వ్యాపారులను ప్రోత్సాహించవద్దని, బయ్యర్ మాత్రమే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని కోరారు. సీసీఐ కేంద్రాల్లో రైతులకు సరిపడ వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో నకిరసేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజులామాధవరెడ్డి, తాసీల్దార్ పుష్పలత, మాజీ జడ్పీటీసీ మాద యాదగిరి, నాయకులు పెద్ది సుక్కయ్య, బెజవాడ సైదులు, ముత్యాల లింగయ్య, మిట్టపల్లి శివ, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

You may also like...