ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి : సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి : సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి


జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 3: కల్వకుర్తి పట్టణ కేంద్రం కల్వకుర్తి పట్టణ కేంద్రంలోని బీఎస్ఎన్ఎల్ ప్రాంగణంలో శ్రీశ్రీ శ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ దివ్య మంగళ శాసనములతో నిర్వహిస్తున్న శ్రీకృష్ణ కాలచక్రం 91వ విశ్వశాంతి మహా యాగం మహోత్సవంలో సోమవారం ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ , టాస్క్ సి ఓ ఓ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలో శాంతి, సామరస్యం నెలకొని ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. సమాజంలో మానవీయ విలువలు పెంపొందాలని, పరస్పర ప్రేమాభిమానాలు, ఐక్యతతో ప్రజలు ముందుకు సాగాలని అన్నారు.
ఇలాంటి మహా యాగాలు దేశానికి, రాష్ట్రానికి, సమాజానికి శుభఫలితాలను అందిస్తాయని, విశ్వశాంతి కోసం జరుగుతున్న ఈ పవిత్ర యాగంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.అనంతరం యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామీజీ ఆశీర్వాదాలు స్వీకరించి,రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం, సస్యశ్యామలత కలగాలని ప్రార్థించారు. ఆయనతో పాటు పలువురు ఐక్యత ఫౌండేషన్ సభ్యులు, పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

You may also like...