సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు భరోసా.. జీ. ఎస్. ఆర్
- వెల్దండకు వెలుగులు – 100 కెవి ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన సర్పంచ్ - September 19, 2026
- కల్వకుర్తిలో విషాద ఘటన వినాయక మండపం వద్ద విద్యుత్ షాక్ తో యువకుడు బలి - September 19, 2026
- బాలల బంగారు భవిష్యత్తుకు పోషకాహారమే పునాది – వెల్దండలో సమన్వయ సమావేశం - September 19, 2026

కల్వకుర్తి సెప్టెంబర్ 17 : కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం ఇస్రాయిపల్లి గ్రామానికి చెందిన రాచాలపల్లి స్వప్న కు తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.25,000ల చెక్కును గురువారం కల్వకుర్తిలో వారి కుటుంబ సభ్యులు ముత్యాల నరేష్ కు అందజేశారు.ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం వారికి ఎంతో కొంత భరోసాను కల్పిస్తుందని అన్నారు. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలవడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు.ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ గౌడ్, కౌన్సిలర్ రామ్ నాయక్, మాజీ కౌన్సిలర్లు బోజిరెడ్డి, సురేష్, నాయకులు మాధవ రెడ్డి, కరోనా ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.
