రోడ్డు ప్రమాద బాధితురాలికి పీఎం రాహత్‌తో ఉచిత వైద్యం

జీనోమ్ వ్యాలీ,  లాల్‌గడి మలక్‌పేట్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలమణి (58) అనే మహిళ గాయపడింది. నవంబర్ 5న కాశవాడ నుంచి లాల్‌గడి మలక్‌పేట్‌కు ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఆమె కుడిచేతికి గాయాలయ్యాయి. కుమారుడు మహేష్ ఆమెను మెడిసిటీ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ఇన్‌స్పెక్టర్ గురువయ్య కేసు నమోదు చేశారు. పీఎం రాహత్ పథకం ద్వారా తొలుత చెల్లించిన రూ.13,430ను ఆసుపత్రి తిరిగి చెల్లించడంతో పాటు తదుపరి వైద్యాన్ని ఉచితంగా…