ప్రజా ఆరోగ్య పరిరక్షణకు.. ఐక్యత ఫౌండేషన్ స్వచ్ఛ జలధార

వెల్దండ సెప్టెంబర్ -25 వెల్దండ మండలం తిమ్మినోని పల్లి గ్రామంలోత్రాగునీటి నిల్వ ట్యాంకుల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు.ప్రజలకు పరిశుభ్రమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతోఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో చేపట్టిన “స్వచ్ఛ జలధార” కార్యక్రమం రెండవ విడతలో భాగంగ వెల్దండ మండలం తిమ్మినోని పల్లి గ్రామంలో త్రాగునీటి నిల్వ ట్యాంకులను పరిశుభ్రపరిచారు.జర్మన్ సాంకేతికతతో కూడిన ప్రత్యేక యంత్రాల సహాయంతో ట్యాంకుల్లో పేరుకుపోయిన మురికి, వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో తొలగించి పరిశుభ్రపరిచారు.ఈ కార్యక్రమంలో తిమ్మినోని పల్లి…

మాదాపూర్ బీసీ కాలనీలో రోడ్డుపై పడిన చెట్టు…

కామారెడ్డి జిల్లా బిబిపేట మండలం మాందాపూర్ గ్రామంలో బీసీ కాలనీ లో వీచిన గాలులకు చెట్టు రోడ్డుపై పడింది అయితే ఇట్టి విషయంపై స్పందించిన సర్పంచ్ హరీష్ యాదవ్ వార్డ్ నెంబర్ పందిరి శ్రీకాంత్ రెడ్డి రాజేష్ పాల్గొని అడ్డంగా ఉన్న చెట్టు పక్కకు జరిపారు.

గూడు లేని నిరుపేదలకు ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యం

వెల్దండ: ప్రజా ప్రభుత్వంలోనే నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్నామని వెల్దండ గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, డీసీసీ ఉపాధ్యక్షులు యెన్నం భూపతి రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ లో భాగంగా మండల కేంద్రంలోని కదమంచి సత్యమ్మ కు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ చేసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రత్యేక చొరవతో…

వినాయక శోభాయాత్ర కొరకు అన్నదాన కార్యక్రమాలు

జ్ఞాన తెలంగాణ ప్రతినిధి.వికారాబాద్:గణేష్ శోభాయాత్ర, నిమజ్జనాల నిమిత్తం వికారాబాద్ నగరం లో పలు చోట్ల అన్నదానం కార్యక్రమాలు చేపట్టినటువంటి పెద్దలు, నాయకులు, ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండ సశ్య శ్యామలంగా జరుపుకోవాలని షాపులముందు టెంట్లు వేసుకొని ఎవరి షాపుల ముందు వాళ్ళు జనసాంద్రతలో ఇబ్బందులు లేకుండా గణేష్ శోభాయాత్ర, నిమజ్జనాలను కొనసాగించాలని షాపుల ఓనర్స్, నాయకులూ, పార్టీల కార్యకర్తలు, పలు పెద్దలు కోరుకుంటున్నారు.

గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి : ఐసీడీఎస్ సూపర్ వైజర్ సోమ పద్మావతి

గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి : ఐసీడీఎస్ సూపర్ వైజర్ సోమ పద్మావతిజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 19 :కట్టంగూర్ మండలం మునుకుంట్ల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. పోషకాహార వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు.‌ ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్ వైజర్ సోమ పద్మావతి మాట్లాడుతూ.. గర్భిణీలు, బాలింతలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం…

యువతకు సాంకేతిక నైపుణ్యాలు – 5500 మందికి శిక్షణ

వెల్లడం సెప్టెంబర్‌ 19: తెలంగాణ యువతకు భవిష్యత్‌ సాంకేతిక నైపుణ్యాలు అందించి ఉపాధి అవకాశాలకు అనుసంధానం చేయడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సాంకేతిక విద్య, ఉపాధి శిక్షణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 25 కేంద్రాల్లో 5,500 మంది విద్యార్థులకు మూడు నెలలపాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. కృత్రిమ మేధస్సు, మేఘ గణన, డిజిటల్‌ నైపుణ్యాలు, ఎలక్ట్రానిక్స్‌ తయారీ వంటి ఆధునిక…

వరుసగా రెండోసారి లడ్డు దక్కించుకున్న రేవెల్లి దర్గయ్య.. భారీగా రూ. 65000

వెల్దండ: వినాయక చవితి సందర్భంగా శ్రీరామ గణేష్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డూ వేలంపాట ఉత్సాహంగా సాగింది. వేలంపాటలో రేవల్లి దర్గయ్య వరుసగా రెండోసారి లడ్డూ ప్రసాదాన్ని సొంతం చేసుకున్నారు. ఈసారి రూ.65 వేల ధరకు లడ్డూను దక్కించుకున్నారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ హాజరై దర్గయ్యకు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్, శ్రీరామ గణేష్ యూత్, ఆలయ కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు…

సెలైన్ చేతికే… సేవ మాత్రం ఆగలేదు!

బాన్సువాడ :తాను పేషెంట్‌గా మారినా.. రోగుల సేవలోనే డాక్టర్ శ్రీను నాయక్వృత్తి ధర్మానికి అంకితభావం.. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం,వైద్యుడిని దైవంతో సమానంగా ఎందుకు చూస్తారో నిరూపించే మానవీయ ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ తన విధులకు సెలవు పెట్టకుండా, ఒక చేతికి సెలైన్ ఎక్కించుకుంటూనే మరోవైపు రోగులకు వైద్య సేవలు అందించిన డాక్టర్ శ్రీను నాయక్ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి ప్రతిరోజూ చుట్టుపక్కల గ్రామాల నుంచి…

ఘనంగా మోమిన్ పేట్  ప్రాథమిక వ్యవసాయ  సహకార సంఘం  చైర్మన్  ప్రమాణ స్వీకారోత్సవం

వికారాబాద్ నియోజకవర్గం  మోమిన్ పేట్ మండలం కేంద్రంలో ప్రాథమిక  వ్యవసాయ సహకార సంఘ నూతన చైర్మన్, పాలకవర్గ ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది. మోమిన్ పేట్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన చైర్మన్ గా ఎన్ . నరోత్తం రెడ్డి గారు , వైస్ ఛైర్మన్ గా మల్లారెడ్డి మరియు పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నూతన  పిఎసి ఎస్ చైర్మన్ మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ద్యేయంగా…

మోమిన్ పేట్ పిఎసిఎస్ చైర్మన్ గా ఎన్ నరోత్తంరెడ్డి బాధ్యతలు

మోమిన్ పేట్ మండల ఎసిఎస్ చైర్మన్ గా చీమలదరి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎన్ నరోత్తం రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు స్థానిక కార్యాలయంలో నాయకుల, కార్యకర్తల ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. తన ఎన్నికకు సహకరించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నూతన చైర్మన్ కు నాయకులు అభినందలు తెలిపారు