అనారోగ్యంతో ఉన్న హుస్సేన్‌కు సర్పంచ్ బచ్చలకూర శ్రీనివాసులు పరామర్శ

చెరుకూరు,అక్టోబర్ 17: చెరుకూరు గ్రామానికి చెందిన ఎండి హుస్సేన్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ బచ్చలకూర శ్రీనివాసులు,ఉప సర్పంచ్ చెర్కా కొండల్ ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా రూ.5 వేల విరాళం అందజేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు అలీలోద్దీన్, జంగయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు.1001272867.jpg

You may also like...