ఉప్పల్ స్టేడియంలో భారత్ – బంగ్లా మ్యాచ్.. రాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లు
- మరికొద్ది క్షణాల్లో టంగుటూరుకు మందకృష్ణ మాదిగ - October 15, 2026
- దేవుల నాయక్కు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడి జన్మదిన శుభాకాంక్షలు - October 12, 2026
- పెళ్లి హామీతో లైంగిక వేధింపుల ఆరోపణ.. డీఐ బాలస్వామి అరెస్ట్! - October 11, 2026

ఉప్పల్ స్టేడియంలో భారత్ – బంగ్లా మ్యాచ్.. రాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లు
ఉప్పల్ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు భారత్ – బంగ్లాదేశ్ మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో స్టేడియం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పాసులు ఉన్నవారిని మాత్రమే స్టేడియంలోకి అనుమతిస్తున్నారు.
ఇక.. మ్యాచ్ దృష్ట్యా అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైలు సమయం పొడిగించినట్లు మెట్రో అధికారులు తెలిపారు. ఆర్టీసీ కూడా అదనపు బస్సులను నడిపేందుకు రెడీ అయ్యింది. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మూడు టీ20ల సిరీస్‌ను 2-0తో భారత్ కైవసం చేసుకుంది. క్లీన్ స్వీప్ చేసేందుకు టీమిండియా సిద్ధమైంది.
