తెలంగాణ ప్రజలకు గొప్ప శుభవార్త: డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
- మరికొద్ది క్షణాల్లో టంగుటూరుకు మందకృష్ణ మాదిగ - October 15, 2026
- దేవుల నాయక్కు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడి జన్మదిన శుభాకాంక్షలు - October 12, 2026
- పెళ్లి హామీతో లైంగిక వేధింపుల ఆరోపణ.. డీఐ బాలస్వామి అరెస్ట్! - October 11, 2026

తెలంగాణ ప్రజలకు గొప్ప శుభవార్త: డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్ :
బీయస్పీ – బీఆరెస్ ల కూటమి చర్చలపై నిన్న ఏర్పడిన సందిగ్దానికి బీయస్పీ జాతీయ అధ్యక్షురాలు బెహన్జీ మాయావతి గారు కొద్ది సేపటి క్రితమే తెరదించారు. ప్రస్తుతం బీఆరెస్ పార్టీ దేశంలో ఏ కూటమి లో లేనందున, బీయస్పీకి ఆ పార్టీతో పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో కలసి పనిచేయడానికి బెహన్జీ గారు అనుమతించారని బీయస్పీ హై కమాండ్ తెలిపింది.
త్వరలోనే పొత్తు విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి సమక్షంలో జరిగే తదుపరి చర్చలకు బీయస్పీ యం పీ, కేంద్ర సమన్వయకర్త, శ్రీ రాంజీ గారు బెహన్జీ దూతగా హాజరు కానున్నారు అని ట్విట్టర్ వేదిక గా తెలిపారు
