రక్తంతో సంబంధం లేకుండా చెమటతో సుగర్ టెస్ట్
- రేపే శంకర్పల్లిలో రేషన్ కార్డుల పంపిణీ - August 31, 2026
- ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ నిరసన దీక్ష - August 31, 2026
- రైల్వే డబుల్ లైన్ భూసేకరణ పనులు వేగవంతం చేయాలి - August 31, 2026

రక్తంతో సంబంధం లేకుండా చెమటతో సుగర్ టెస్ట్
సాధారణంగా షుగర్ టెస్ట్ చేయాలంటే రక్తం అనేది అవసరం. కానీ రక్తం అవసరం లేకుండా మానవుని చెమటను పరీక్షించి నిమిషంలోనే సుగర్ టెస్ట్ రిజల్ట్ తెలుసుకునే ఎలక్ట్రో కెమికల్ పరికరాన్ని ఏలూరుకు చెందిన శ్రీనివాసరావు కనుగొన్నారు.ఈ పరికరం పనితీరు రెండేళ్ల పాటు పరీక్షించిన ఇండియన్ పేటెంట్ అథారిటీ ఇటీవల శ్రీనివాసరావుకి పేటెంట్ హక్కులు జారీ చేసింది.జీవ రసాయన శాస్త్రంలో పీహెచ్డీ చేసిన ఈయన ప్రస్తుతం ఐఐటి కాన్పూర్లో సైంటిస్ట్ గా పని చేస్తున్నారు. నాలుగేళ్లు కష్టపడి ఈ పరికరాన్ని తయారు చేసినట్లు శ్రీనివాసరావు తెలిపారు.
