నటుడు విజయ్ ఆంటోనీ గారి కుమార్తె ఆత్మహత్య! తల్లిదండ్రులు పిల్లలకు సమయం కేటాయించండి.
- రేపే శంకర్పల్లిలో రేషన్ కార్డుల పంపిణీ - August 31, 2026
- ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ నిరసన దీక్ష - August 31, 2026
- రైల్వే డబుల్ లైన్ భూసేకరణ పనులు వేగవంతం చేయాలి - August 31, 2026

నటుడు విజయ్ ఆంటోనీ గారి కుమార్తె ఆత్మహత్య!
ఆమె మాత్రమే కాదు మనలాంటి ఇళ్లల్లో కూడా పిల్లలు Depression కి గురవుతూ తీవ్రమైన మనోవేదనకు లోనవుతున్నారు. కారణాలు ఏవైనా కావొచ్చు కానీ మీరు కనిపెంచిన పిల్లలు ఇలా ఆత్మహత్య చేసుకోవడం అంటే తల్లిదండ్రులకు ఎంత నరకమో తలచుకుంటేనే హృదయం ద్రవించిపోతుంది.
అయినా మీరు మీ పిల్లలకు మంచి బడి, బట్టలు, వస్తువులు, బొమ్మలు, డబ్బులు ఇస్తే సరిపోతుంది వాళ్లు చక్కగా ఉంటారు అనే భ్రమలో ఉన్నారు. వీటన్నింటితో పాటు వీటన్నింటికంటే విలువైన సమయాన్ని మీరు తల్లిదండ్రులుగా పిల్లలకు ఇవ్వాలి. అప్పుడే వారి మానసిక స్థితి ఏంటి, వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ల భయాలు ఏంటి, సంతోషాలు ఏంటి అన్నది మీకు తెలుస్తుంది.
పిల్లలు వారికొచ్చిన ప్రతి సమస్యనీ మీ ముందు ఉంచగలిగేలా మీరు వారితో స్నేహపూరిత వాతావరణాన్ని ఏర్పరుచుకుంటే ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మా తల్లిదండ్రులు ఉన్నారు అనే ధైర్యం ఉంటుంది మీ పిల్లలకు. మీరు రేయింబవళ్లు కష్టపడి పిల్లల కోసం తెగ సంపాదించేస్తున్నాం అని మురిసిపోతుంటారు. కానీ రేపు ఆ పిల్లలే మీకు లేకపోతే ఏం చేసుకుంటారు మీ ఆస్తులు, అంతస్తులు?
అంత డబ్బు, పేరు, పలుకుబడి ఉన్న నటుడి ఇంట్లో పరిస్థితే ఇలా ఉంటే, మామూలు మనుషులం మన పరిస్థితి ఎలాంటిదో ఒకసారి ఆలోచించుకోవాలి మీరు. వాళ్లతో, వీళ్లతో పోల్చడం చేస్తూ, చదువంటే ఏదో యుద్ధం అయినట్టు ఖచ్చితంగా గెలిచే తీరాలి, First Rank మాత్రమే రావాలి అని మీ Frustration అంతా వారిపై రుద్దడం కాకుండా, వాళ్లల్లో ఆహ్లాదకరమైన పోటీతత్వం ఉండేలా చూసుకోవాలి. అది చదువైనా, జీవితమైనా, మరేదైనా కావొచ్చు !
అసలు మన Education System సరిగా లేదు. ఈ పోటీ ప్రపంచంలో పిల్లలకి విలువలు నేర్పించడం మానేసి, మార్కుల కోసం చదివే Machine’s లా తయారు చేస్తున్నారు. ఎంత మంచి మార్కులు వచ్చినా కూడా ఇంకా ఏదో అసంతృప్తి నిండిపోతుంది పిల్లల్లో. ఏదో తెలియని వెలితి, దాంతో తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారు. ఈ పరిస్థితి ఎక్కడికి దారితీస్తుందో అర్థం కావడం లేదు.
ఈ పోటీ ప్రపంచంలో పిల్లలకు అమ్మా నాన్న తప్ప మన బంధువులు ఎవరు? బంధాలు ఏంటి? బంధుత్వాలు ఏంటి? అనేవి కనీస అవగాహన కూడా లేకుండా అయిపోతుంది. విచారించదగ్గ విషయం ఇది. నూటికి నూరుపాళ్లూ తల్లిదండ్రుల పొరపాటు వల్లే ఇది జరుగుతుంది. మీరు మీ పిల్లలకు సంపాదించి పెడుతున్నారు, వాళ్ల కోసమే కదా అని కష్టపడుతున్నారు, కానీ ఆ పిల్లలకు మీరు సరి అయిన సమయాన్ని ఇవ్వలేకపోతున్నారు.
మీరు మీ పిల్లలతో మీ స్వచ్ఛమైన సమాయన్ని గడపకపోవడమే అన్ని సమస్యలకు తల్లితండ్రులుగా మీ పిల్లలకి మీరే కారణం.
దయచేసి తల్లిదండ్రులు పిల్లలకు సమయం కేటాయించండి!
