నూతన వధూవరులను ఆశీర్వదించిన జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు

ఝరాసంగం జ్ఞానతెలంగాణ , నవంబర్ 25:
ఝరాసంగం మండల కేంద్రంలోని వాసవి కల్యాణ మండపంలో బుధవారం నిర్వహించిన వివాహ వేడుకకు జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
బోయిని నిర్మల, సంగన్న దంపతుల కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, జహీరాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తట్టు నారాయణ, ఝరాసంగం మండల నాయకులు వెంకటేశం, నర్సింలు,ఝరాసంగం సర్పంచ్ వినోద బాలరాజ్.ప్యాలవరం సర్పంచ్.కోహీర్ మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

You may also like...