రిపోర్టర్, సంగారెడ్డి | 9000600737
Latest posts by MOHAMMAD MOHAMMAD
(see all) ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామంలో బుధవారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. చెరుకు పొలంలో చెరుకు కటింగ్ మిషన్ వెనుక పనిచేస్తున్న ఓ వృద్ధ కూలీ ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి మృతి చెందాడు.వివరాల్లోకి వెళితే.. బర్దిపూర్ గ్రామానికి చెందిన బేగరి సమ్మయ్య (75), తండ్రి నర్సప్ప, రోజువారీ కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో నవంబర్ 25న ఉదయం సుమారు 10 గంటల సమయంలో చెరుకు పొలంలో కటింగ్ మిషన్ వెనుక పనిలో నిమగ్నమై ఉన్నాడు. అదే సమయంలో ట్రాక్టర్ డ్రైవర్ వెనుక పనిచేస్తున్న సమ్మయ్యను గమనించకుండా ట్రాక్టర్ను ముందుకు కదిలించడంతో సమ్మయ్య ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడ్డాడు. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు.మృతుడి కుమారుడు బేగరి నరసింహులు (42) ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.