రిపోర్టర్, సంగారెడ్డి | 9000600737
Latest posts by MOHAMMAD MOHAMMAD
(see all) మొగుడంపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. పథకం ద్వారా ప్రతి కుటుంబానికి కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించారు.అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పవన్ రాథోడ్, మాజీ మండల అధ్యక్షుడు మక్సూద్ అహ్మద్, సర్పంచ్ రాజు,కాంగ్రెస్ నాయకులు కాను నాయక్, కేసు, శేఖర్ గౌడ్, మారుతి రాథోడ్, యువజన కాంగ్రెస్ నాయకుడు విష్ణు తదితరులు పాల్గొన్నారు.