మొమిన్‌పేట్ యూబీఐ బ్యాంక్ మేనేజర్ టేకులపల్లి గ్రామం పర్యటన మరియు ప్రత్యేక సమావేశం

మొమిన్‌పేట్ మండల పరిధిలోని టేకులపల్లి గ్రామంలో యూబీఐ (యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) బ్యాంక్ మేనేజర్ ఆధ్వర్యంలో   ఫైనాన్సియల్  ఇన్క్లూసివ్  అవేర్నెస్ ప్రోగ్రామ్ లో బాగంగా  గ్రామస్థులతో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు, ముఖ్యంగా రైతులు మరియు మహిళలకు బ్యాంకింగ్ సేవలపై అవగాహన కల్పించడం ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం.

ఈ సమావేశంలో బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ, గ్రామంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా బ్యాంక్ పనిచేస్తోందని తెలిపారు. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. రైతులకు తక్కువ వడ్డీతో పంట రుణాలు, దీర్ఘకాలిక పెట్టుబడి రుణాలు సులభంగా అందించేందుకు బ్యాంక్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రైతులు దలారీల ప్రమేయం లేకుండా నేరుగా బ్యాంకును సంప్రదించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అలాగే, కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ముద్ర లోన్లు, మరియు సామాజిక భద్రతా పథకాలైన పీఎం జేజేబీవై (PMJJBY), పీఎంఎస్‌బీవై (PMSBY),  RKYC    మరియు అటల్ పెన్షన్ యోజన వంటి వాటి ప్రాముఖ్యతను వివరించారు. డిజిటల్ లావాదేవీల వినియోగంపై రైతులకు మరియు యువతకు అవగాహన కల్పించారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరికీ కూడా ఏటీఎం పిన్ నంబర్లు లేదా ఓటీపీలు చెప్పకూడదని హెచ్చరించారు.

You may also like...