బీమా సౌకర్యం జీపీ సిబ్బంది ఆర్ధిక భద్రత : పామనుగుండ్ల సర్పంచ్ వడ్డె మాధవిసైదిరెడ్డి
- బీమా సౌకర్యం జీపీ సిబ్బంది ఆర్ధిక భద్రత : పామనుగుండ్ల సర్పంచ్ వడ్డె మాధవిసైదిరెడ్డి - November 24, 2026
- ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు.. శివాలయాల్లో భక్తుల సందడి.. దీపారాధనతో ఆధ్యాత్మిక శోభ - November 24, 2026
- ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం నూతన కమిటీల ఏకగ్రీవ ఎన్నిక - November 24, 2026
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 24 : బీమా సౌకర్యం గ్రామపంచాయతీలో పని చేస్తున్న మల్టీపర్పస్ సిబ్బందికి ఆర్ధిక భద్రత ఇస్తుందని మండలంలోని పామనుగుండ్ల సర్పంచ్ వడ్డె మాధవిసైదిరెడ్డి అన్నారు. పంచాయతీరాజ్ ఆదేశాల మంగళవారం జీపీ నిధుల నుంచి ఒక్కొక్కరికి రూ.755 ప్రీమియం చెల్లించి సిబ్బందికి రూ.15లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించారు. ఈ మేరకు బీమా పత్రాలను సిబ్బందికి అందజేసి మాట్లాడారు. గ్రామ పరిశుభ్రత, పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణలో నిరంతరం శ్రమించే సిబ్బంది సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ బండారు నవనీత కృష్ణ. వార్డు సభ్యులు కారంపూడి సాయికుమార్, కొప్పు వెంకటమ్మ, ఆవుల రాములు, బొందు నాగమణి, పీల్డ్ అసిస్టెంట్ బండారు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
