నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలి : సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు గంజి మురళి

నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలి : సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు గంజి మురళి 
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 25 : లోవోల్టేజీ సమస్యను వెంటనే పరిష్కరించి రైతులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గంజి మురళి డిమాండ్ చేశారు. విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని  శుక్రవారం కట్టంగూర్ విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  మండలంలోని పలు గ్రామాల్లో లోవోల్టేజీ సమస్యతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యుత్‌ సరఫరా ఉన్నప్పటికీ లో వోల్టేజీ కారణంగా వ్యవసాయ బోర్లు, మోటార్లు పనిచేయడం లేదని, పంటలకు సకాలంలో నీరందక రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. అధిక లోడ్‌ కారణంగా తరచూ విద్యుత్‌ అంతరాయాలు ఏర్పడుతున్నాయని, ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు అవసరమైన చోట కొత్తవి  ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం ఏఈ హుస్సేన్ కు వినతిపత్రం అందజేశారు. సిపిఎం మండల కార్యదర్శి పెంజర్ల సైదులు, గుడుగుంట రామకృష్ణ, మురారి మోహన్ , జాల ఆంజనేయులు,  ముసుగు రవీందర్,  చెరుకు జానకి పాల్గొన్నారు.

You may also like...