వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్

ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆదివారం రెండు వేర్వేరు వివాహ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ముత్యపు రాఘవుల ఫంక్షన్ హాల్‌లో అడ్వకేట్ పండరి కుమార్తె వివాహ వేడుకకు, కామారెడ్డిలోని బృందావన్ గార్డెన్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త నాగయిలా సాయిలు కుమార్తె వివాహ వేడుకకు హాజరై వధూవరులకు ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You may also like...