జనగామలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి విశేష స్పందన
- విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరం – అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె. సందీప - November 21, 2026
- జనగామలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి విశేష స్పందన - November 21, 2026
- రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జనగామలో భారీ బైక్ ర్యాలీ నిర్వహణకు నిర్ణయం - November 21, 2026

పట్టణ ప్రజలకు కుటుంబ భద్రతతో పాటు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని జనగామ మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 30 వార్డుల్లో ప్రారంభించారు.పట్టణంలో సుమారు 14,900కు పైగా రేషన్ కార్డులు ఉండగా, అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ పథకంలో నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం నెల రోజుల గడువు కల్పించింది. పథకం ప్రారంభమైన తొలిరోజే ప్రజల నుంచి విశేష స్పందన లభించగా, 30 వార్డుల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాల ద్వారా 700కు పైగా కుటుంబాలు తమ వివరాలను నమోదు చేసుకున్నాయి.ఈ సందర్భంగా అర్హులైన ప్రతి కుటుంబం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపాలిటీ అధికారులు సూచించారు. చివరి తేదీ వరకు వేచి చూడకుండా తమకు కేటాయించిన వార్డులోని ప్రత్యేక శిబిరాన్ని సందర్శించి అవసరమైన వివరాలు సమర్పించి నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వార్డుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, నమోదు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని మున్సిపాలిటీ అధికారులు తెలిపారు.
