రిపోర్టర్, మేడ్చల్-మల్కాజ్గిరి | 9966689865
Latest posts by Veeranna Yerra
(see all) గాజులరామారం: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా గాజులరామారం సర్కిల్ రోడ్ మేస్త్రీనగర్ డివిజన్ పరిధిలోని శ్రీరాంనగర్, ఎన్టీఆర్ నగర్లలో రూ.1.25 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6,600 చేయూత పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలు అందిస్తోందన్నారు. ప్రభుత్వ భూముల విక్రయాలపై బీఆర్ఎస్ నాయకులపై ఆరోపణలు చేశారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు మధుసూదన్, బుచ్చిరెడ్డి, జిమ్మి దేవేందర్, పున్నారెడ్డి, రషీద్, ఐలయ్య, సలీం, బలరాం, రఘు, రజాక్, నాగభూషణం, వెంకటేష్, నరసింహ, సాయి ప్రవీణ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
