ఎన్‌ఐ యాక్ట్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక లోక్ అదాలత్
- విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరం – అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె. సందీప - November 21, 2026
- జనగామలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి విశేష స్పందన - November 21, 2026
- రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జనగామలో భారీ బైక్ ర్యాలీ నిర్వహణకు నిర్ణయం - November 21, 2026

జనగామ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జనగామ కోర్టు ప్రాంగణంలో ఎన్‌ఐ యాక్ట్ కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించారు. ఉదయం 10:30 గంటలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి బి. ప్రతిమ ప్రత్యేక లోక్ అదాలత్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె న్యాయవాదులు, కక్షిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్‌ఐ యాక్ట్ కేసులను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవాలని సూచించారు. ఇరుపక్షాలు వివాదాలకు దూరంగా ఉండి ప్రశాంతంగా, సంతోషంగా జీవించేందుకు లోక్ అదాలత్ మంచి వేదికగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.కక్షిదారుల సౌకర్యార్థం మొత్తం నాలుగు బెంచ్‌లను ఏర్పాటు చేశారు.మొదటి బెంచ్: జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. ప్రతిమ, సభ్యురాలిగా న్యాయవాది కె. పుష్ప.రెండవ బెంచ్: ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి డాక్టర్ జి. శశి, సభ్యురాలిగా న్యాయవాది ఇ. జోష్ణ.మూడవ బెంచ్:అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె. సందీప్, సభ్యురాలిగా న్యాయవాది మేకల స్వప్న.నాలుగవ బెంచ్:జూనియర్ సివిల్ జడ్జి జి. శశి, సభ్యుడిగా న్యాయవాది అమ్మరాజు శ్రీనివాస్ వ్యవహరించారు.ఈ సందర్భంగా ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించుకునే అవకాశాన్ని కక్షిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని న్యాయాధికారులు సూచించారు.
