ప్రైవేట్ ఆసుపత్రులపై డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీలు
- విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరం – అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె. సందీప - November 21, 2026
- జనగామలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి విశేష స్పందన - November 21, 2026
- రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జనగామలో భారీ బైక్ ర్యాలీ నిర్వహణకు నిర్ణయం - November 21, 2026

పాలకుర్తిలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. వాణిశ్రీ శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వైద్య విధాన పరిషత్ సమన్వయకర్త డా. సంధ్యతో కలిసి ఆసుపత్రులను సందర్శించి రికార్డులను పరిశీలించారు.ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ, ప్రతి ప్రైవేట్ ఆసుపత్రి తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతులు పొందిన తర్వాతే నిర్వహించాలన్నారు.ఆసుపత్రులకు సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టంలోని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.ఈ తనిఖీల్లో సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
